Aswapuram: అశ్వాపురంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి చెట్టి సురేష్ నివాళి
Aswapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా మాల సంఘాల జేఏసీ నేత చెట్టి సురేష్ ఘన నివాళులర్పించారు.
Aswapuram: అశ్వాపురంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి చెట్టి సురేష్ నివాళి
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా మాల సంఘాల జేఏసీ పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు చెట్టి సురేష్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చెట్టు సురేష్ మాట్లాడుతూ.. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. అణగారిన వర్గాలకు విద్యను అందించి, మహిళా విద్యకు మార్గం చూపి, సమానత్వ సమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
ఫూలే ఆశయాలైన విద్య, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో. జూపల్లి ధ్రువ కుమార్.పాషా.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




