Aswaraopeta: ఇది మట్టి రోడ్డు కాదండి బాబు.. సిమెంట్ రోడ్డే.. తీవ్ర ఇబ్బందులు!
Aswaraopeta: అశ్వారావుపేట ప్రధాన సెంటర్‌లోని సిమెంట్ రోడ్డుపై మట్టి పేరుకుపోయి దుమ్ముతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Aswaraopeta: ఇది మట్టి రోడ్డు కాదండి బాబు.. సిమెంట్ రోడ్డే.. తీవ్ర ఇబ్బందులు!
Aswaraopeta: అశ్వారావుపేట పట్టణం ప్రధాన సెంటర్ పొట్టిశ్రీరాములు విగ్రహం దగ్గర నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు వున్న సిమెంట్ రోడ్ మట్టి పేరుకుపోయి అగమ్య గొచరంగ ఉంది. రోడ్డుకి ఇరువైపులా వున్న షాప్ వారికీ రోడ్డుపై వెళ్లే వాహనాలు లేపే దుమ్ముతో చాలా ఇబ్బందిగా ఉందని, వేల సంఖ్యలో వాహనాలు తిరగడం వల్ల విపిరితమైన దుమ్ముతో శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిమెంట్ రోడ్డు శిదిలవాస్తకి వచ్చినా గత పంచాయతీ వారు కానీ ఇప్పుడు మున్సిపాలిటీ వారు ఎలాంటి క్లీనింగ్ చేయించడం లేదని ఇక్కడి ఇళ్ళ వాళ్ళు, షాప్స్ వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, చైర్మన్ గారు పట్టించుకోని సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నారు.




