Aswaraopeta: అశ్వారావుపేట 10వ వార్డులో అభివృద్ధి పనుల జోరు!

Aswaraopeta: అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు ఏఎస్ఆర్ నగర్‌లో డ్రైనేజీ నిర్మాణాలు, స్పీడ్ బ్రేకర్ల పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 13 Oct 2026 7:54 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేట 10వ వార్డులో అభివృద్ధి పనుల జోరు!

అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం ప్రతి వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు ASR నగర్ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు.

పక్కా డ్రైనేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన...

గ్రామంలో మురుగునీరు రోడ్లపైకి రాకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పక్కా డ్రైనేజీ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలతో కాలువలు నిర్మిస్తున్నారు.

చిన్నారుల భద్రతకు స్పీడ్ బ్రేకర్లు...

గ్రామంలోని సిసి రోడ్లపై ద్విచక్ర వాహనాలు అతివేగంగా వెళుతుండటంతో చిన్న పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన 10వ వార్డు కౌన్సిలర్ మీండ హరిబాబు, గ్రామంలోని ప్రధాన సిసి రోడ్లపై అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించారు. దీంతో వాహనదారులు నిదానంగా వెళ్లాల్సి వస్తోందని, పిల్లలకు రక్షణ లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధిలో ఆదర్శంగా 10వ వార్డు...

మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నప్పటికీ, 10వ వార్డులో మాత్రం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి ప్రమోద్, 10వ వార్డు కౌన్సిలర్, మిండా హరిబాబు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరుణాకర్, సుధాకర్, రాజ్ కుమార్, రాంబాబు, దయాకర్, బాలాజీ, మస్తాన్ మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA