Bhadrachalam: గిరిజన దర్బార్, ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలి!

Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ గిరిజన దర్బార్, సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రజావాణికి అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదేశించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 23 Nov 2026 6:26 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గిరిజన దర్బార్, ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరుకావాలి!

భద్రాచలం: సోమవారం నాడు భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయము మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదివారం నాడు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

గిరిజనులు మరియు ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని వారు తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు ఉదయం 10.30 గంటలకు భద్రాచలం ఐటీడీఏ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరాలలో తప్పకుండా హాజరుకావాలని వారు పేర్కొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem