Kothagudem: బూర్గంపాడులో ఆటో డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఆటో కిరాయి అడిగిన డ్రైవర్‌పై ఓ వ్యక్తి బీర్ బాటిల్‌తో దాడి చేశాడు.
Kothagudem: బూర్గంపాడులో ఆటో డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఆటో కిరాయి అడిగినందుకు ఓ ఆటో డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి కిరాయి చెల్లించే సమయంలో రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర లేదని చెప్పడంతో నోటు మార్చుకుని వస్తానంటూ సమీపంలోని వైన్ షాప్‌కు వెళ్లాడు. అయితే అక్కడ మద్యం సేవిస్తూ కనిపించడంతో ఆటో డ్రైవర్ తన కిరాయి ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి బీర్ బాటిల్‌తో ఆటో డ్రైవర్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో గాయపడిన డ్రైవర్ చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపడుతూ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




