Khammam: ఈపీఎఫ్‌ఓ నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి!

Khammam: ఖమ్మంలో శుక్రవారం నిర్వహించే ఈపీఎఫ్‌ఓ 'నిధి ఆప్కే నికట్' కార్యక్రమాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శ్రీనివాస్ కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 26 Nov 2026 7:38 PM IST
Khammam
X

Khammam: ఈపీఎఫ్‌ఓ నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి!

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సంస్ధల యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, జిల్లా కార్యాలయం, ఖమ్మం వారు నవంబర్ 27న (శుక్రవారం) ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు “నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని ఖమ్మం బిలీఫ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మెస్సెర్స్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద నిర్వహించనున్నట్టు ప్రాంతీయ పీ.ఎఫ్ కమీషనర్ వై.డి. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, యజమానులు, పెన్షనర్లకు వివిధ సేవలు, అవగాహన కార్యక్రమాలు అందించ బడతాయి అని అన్నారు. ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ సేవలపై అవగాహన కల్పించడం, కొత్తగా కవరైన సంస్థల యజమానులకు పరిచయం, ఆన్ లైన్ సేవల వివరాలు, పెన్షనర్ లకు జీవన్ ప్రమాణ, ఇతర సమస్యల పరిష్కారం, ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజనపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పీ.ఎఫ్ కమీషనర్ శ్రీనివాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.