Yellandu: ఇల్లు తగలబెట్టి దొంగతనం?.. అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర!
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్‌లో పులిపాక జానకమ్మ అనే మహిళ ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.
Yellandu: ఇల్లు తగలబెట్టి దొంగతనం?.. అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర!
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ చెందిన పులిపాక జానకమ్మ ఇల్లు శనివారం అగ్ని ప్రమాదంలో దగ్ధం అయింది.ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో అగ్ని ప్రమాదం జరగడం పై పలు అనుమానాలు తవిస్తుంది. గత రెండు రోజుల క్రితం ఇంట్లో వాళ్ళు అందరు ఊరికి వెళ్లడంతో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ విషయం స్థానికులు అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఉరి నుండి బయలుదేరి వచ్చారు. ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అగ్ని ప్రమాదం లో బడిద అయ్యాయని వాపోయారు.ఇంటి ముందున్న బేడం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించి అగ్ని ప్రమాదంగా సృష్టించినారని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
కాగా ఇంటిలో రెండు తులాల బంగారం, మూడు లక్షల నగదు, ఇంట్లో ఫర్నిచర్ మొత్తంగా సుమారుగా 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుపుతున్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక పంచాయతీ కార్యదర్శి రాజు సందర్శించి పోలీసులకు సమాచారం అందించినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.




