Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్!
Kothagudem: సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్!
Kothagudem: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చేరుకున్నారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి బండి సంజయ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఆయన రాకతో సారపాకలో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రితో పలు స్థానిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ఐటీసీ గెస్ట్ హౌస్ పరిసరాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.




