Kothagudem: కొత్తగూడెంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం!

Kothagudem: కొత్తగూడెంలో బ్యాంక్ ఉద్యోగుల ఒక రోజు సమ్మె విజయవంతం. 5 రోజుల పనిదినాలు, పీఎల్ఐ డిమాండ్లపై స్పందించకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు హెచ్చరిక.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Sept 2026 2:01 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం!

Kothagudem: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కొత్తగూడెం పరిధిలో బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు ఉమ్మడి సమ్మె విజయవంతమైంది. వారానికి ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను ఆమోదించాలని, ఉద్యోగులకు న్యాయమైన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌బీఐ ఆర్‌బీఓ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏజీఎస్ కె. శ్రీకాంత్, రీజినల్ సెక్రటరీ కె. అర్జున్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు కె. నిశ్చల్, విద్యాసాగర్, ఎస్‌బీఐ అవార్డు స్టాఫ్ లీడర్ భవానీ శంకర్, డీసీసీబీ లీడర్ వెంకట కృష్ణ పాల్గొని ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె, అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఒక రోజు సమ్మె కారణంగా ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, తమ పోరాటానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని UFBU మీడియా కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM