Bhadrachalam: భద్రాచలం, మణుగూరు శిశు గృహాలకు మౌలిక వసతులు కల్పించిన సబ్ కలెక్టర్!

Bhadrachalam: భద్రాచలం, మణుగూరు శిశు గృహాలకు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఆదివారం మౌలిక వసతులు కల్పించి, చిన్నారులు, సిబ్బందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 29 Nov 2026 7:40 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం, మణుగూరు శిశు గృహాలకు మౌలిక వసతులు కల్పించిన సబ్ కలెక్టర్!

భద్రాచలం: శిశు గృహ కేంద్రంలోని చిన్నారులకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రేమ పూర్వకమైన వాతావరణ కల్పించి వారికి తల్లిదండ్రులు లేని లోటు మైమరిపిస్తున్న సిబ్బందికి అలాగే శిశుగృహవములకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.

ఆదివారం నాడు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ మరియు మణుగూరు లో ఉన్న శిశు గృహాన్ని గత మాసంలో ఆయన ఆకస్మికంగా సందర్శించి పిల్లల కోసం కల్పిస్తున్న సౌకర్యాలు మరియు శిశుగృహంలో ఉన్న సమస్యలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న సమయంలో కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకురావడంతో ఈరోజు శిశు గృహాలకు మరియు సిబ్బందికి కావలసిన వసతులు కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.

అలాగే భద్రాచలంలోని శిశు గృహం క్యాంపస్ అంతట బహిరంగ లైటింగ్ అవసరమైన ట్యూబ్ లైట్లు మరియు ఫ్యాన్లను వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకు ఇతను నిత్యవసర వస్తువులను కూడా అందించడం జరిగిందని అన్నారు.

శిశు గృహంలో ఉన్న పిల్లలకు సురక్షితమైన సౌకర్యవంతమైన శ్రద్ధతో కూడిన వాతావరణాన్ని కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఎప్పుడు సందర్శించిన శిశు గృహంలో ఉన్న సమస్యలను తక్షణ చర్యలు తీసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు అలాగే ఏదైనా సమస్య లేదా అవసరం గురించి తెలిసిన సందర్భంలో వెంటనే స్పందించి ఆ సమస్యను వేగంగా పరిష్కరించడం వలన క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అన్నారు.

అనంతరం శిశు గృహంలో పనిచేసే సిబ్బందికి నిత్యవసర సరుకులు మరియు వారికి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిశు గృహ వార్డెన్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem