Bayyaram: బయ్యారంలో ఉకే శిరీష మృతిపై కొవ్వొత్తుల ర్యాలీ!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట-గంధంపల్లిలో గిరిజన యువతి ఉకే శిరీష అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 1 Sept 2026 7:38 AM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో ఉకే శిరీష మృతిపై కొవ్వొత్తుల ర్యాలీ!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట _గంధంపల్లి గ్రామపంచాయతీలో మెస్సు రాజశేఖర్ దొర ఆధ్వర్యంలో ఉకే శిరీష అనుమానాస్పద మృతి తీవ్ర ఆవేదన చెందుతూ గ్రామంలోని పురవీధుల్లో తిరుగుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది,

కొత్తపేట గ్రామంలోని ఆదివాసి కుల పెద్ద దొర మెస్సు,రాజశేఖర్, మాట్లాడుతూ...

మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి, జీవితంలో ఎదగాలనే ఆశయంతో నర్సింగ్ విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చిన గిరిజన యువతి ఉకే శిరీష అనుమానాస్పద మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు,

శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె మృతి వెనుక దాగి ఉన్న అనుమానాలు, అసలు నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశాడు.

ఆదివాసి సంఘం నాయకులు ఇర్ప,రాజేష్ మాట్లాడుతూ...

కొండలు, గుట్టలు, మారుమూల గిరిజన తండాల్లో నివసించే గిరిజన మహిళలకు సరైన రక్షణ లేదని మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చదువుకోవడానికి, తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి హైదరాబాద్ వంటి మహానగరాలకు వచ్చే గిరిజన యువతులకు కూడా భద్రత లేకపోవడం అత్యంత బాధాకరం, ఆందోళనకరం అన్నాడు,

ఒక గిరిజన యువతి చదువుకోవాలనే కలతో నగరానికి వస్తే ఆమెకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందితే ఆ ఘటన వెనుక ఉన్న నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అనే ప్రశ్నలు నేడు గిరిజన సమాజం నుంచి వినిపిస్తున్నాయి.

మహిళల రక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కానీ ఆ చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, తప్పు చేసిన వారిలో నిజమైన భయాన్ని కలిగించే విధంగా అమలు కావాలి. నేరం చేసిన వ్యక్తికి శిక్ష తప్పదనే పరిస్థితి ఏర్పడినప్పుడే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది అన్నాడు.

ఆదివాసి సంఘం నాయకుడు ఇర్ప రామారావు మాట్లాడుతూ...

శిరీష మృతి వెనుక ఉన్న అసలు నిజాలను ప్రభుత్వం వెంటనే వెలుగులోకి తీసుకురావాలి. ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలి. ఈ మృతి వెనుక ఎవరైనా బాధ్యులు ఉన్నట్లయితే వారికి చట్టప్రకారం కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.

ఒక యువతి ప్రాణం కోల్పోవడం కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం మాత్రమే కాదు. అది సమాజం, ప్రభుత్వ వ్యవస్థ మహిళల భద్రత విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది.

స్వాతంత్ర భారతదేశంలో ప్రతి మహిళ భయంలేకుండా చదువుకునే, పనిచేసే, స్వేచ్ఛగా జీవించే రోజులు రావాలి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో నగరాలకు వచ్చే గిరిజన యువతులకు పూర్తి భద్రత కల్పించాలి.

శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి...

శిరీష మృతి వెనుక నిజాలు బయటకు రావాలి...

బాధ్యులు ఎవరో తేలాలి...

దోషులకు కఠిన శిక్ష పడాలి...

గిరిజన యువతుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలి...

అంటూ ఉకే శిరీష అనుమానాస్పద మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కుల పటేల్ పులుషం,రమేష్, కొట్టెం పుల్లయ్య, వట్టం శీను, చింత కోటేష్, చింత భార్గవ్, సువర్ణపాక వెంకటేష్, రాఘవ, అనిత్, చాట్ల సంపత్, చాట్ల అశోక్, చాట్ల పాపారావు, రమ, ఆదివాసి మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story