Bayyaram: కొత్తపేటలో కాటమయ్య గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌడ సంఘం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో కాటమయ్య గుడిలో గౌడ సంఘం అధ్యక్షుడు గట్టు రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, దసరా శుభాకాంక్షలు.
Bayyaram: కొత్తపేటలో కాటమయ్య గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌడ సంఘం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలోని కొత్తపేట, గంధంపల్లి, దుబ్బగూడెం గ్రామాల్లో గౌడ సంఘం అధ్యక్షుడు గట్టు రమేష్ ఆధ్వర్యంలో ఆరాధ దైవమైన కాటమయ్య గుడిలో గౌడ వృత్తులైన ఆయుధాలకు, మోకులు, ముత్తాతలకు, ఆయుధకు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌడ సంఘ అధ్యక్షుడు గట్టు రమేష్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ లోని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసినాడు ,చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి ఆ జగన్మాత దుర్గాదేవి, కంట మహేశ్వరి (కాటమయ్య)ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలి… ప్రతి అడుగులో విజయం తోడవ్వాలి… ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో కళకళలాడాలి అన్నాడు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ బుర్ర రమేష్ గౌడ్, గౌడ సంఘం సెక్రెటరీ పిల్లల మల్లికార్జున్ గౌడ్ , గౌడ సంఘం సభ్యులు గునిగంటి శివాజీ గౌడ్ , చిర్ర శీను గౌడ్ , రంగు కుమారస్వామి గౌడ్., దేశిని సాంబయ్య గౌడ్, పెద్దలు రంగు రాందాస్ గౌడ్, చిర్ర చంద్రయ్య గౌడ్, గట్టు రాంబాబు గౌడ్, తాళ్లపల్లి శీను గౌడ, చింతనూరి భాస్కర్ గౌడ, చింతనూరి వీరన్న గౌడ, పంజాల రఘువీర్ గౌడ, గట్టు శీను గౌడ, దేశిని శీను గౌడ, కొండ శీను గౌడ, గౌడ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.




