Julurpadu: బేతాళపాడులో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Julurpadu: జూలూరుపాడు మండలం బేతాళపాడులో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాలు. బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని వేడుకలు నిర్వహించారు.
Julurpadu: బేతాళపాడులో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Julurpadu: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో మహిళలు జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గూగులోత్ సునీత, ఉపసర్పంచ్ బత్తుల అశోక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డిబోయిన రాము, వాడ వెంకటేశ్వర్లు, గూగులోత్ మహేష్, పోగుల నాగభూషణం, బానోత్ చందర్, నర్ల వెంకటేశ్వర్లు, రాంబాబు, రాంచందర్, బిక్కు, లక్ష్మణ్, మహేష్, సీత్తయ్య మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు




