Bhadrachalam: భద్రాచలంలో గంజాయి సేవించిన ముగ్గురు యువకులు అరెస్ట్
Bhadrachalam: భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద గంజాయి సేవించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు, నిరంతర నిఘా కొనసాగింపు.
Bhadrachalam: భద్రాచలంలో గంజాయి సేవించిన ముగ్గురు యువకులు అరెస్ట్
భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట దిగువన రెడ్డి సత్రం సమీపంలో గంజాయి సేవించినట్లు అనుమానిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐ వి. సతీష్ బృందం అనుమానాస్పదంగా కనిపించిన యువకులను పరీక్షించగా, గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.
జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఆదేశాల మేరకు, భద్రాచలం డీఎస్పీ ఎం. అరుణ్ కుమార్ సూచనలతో, టౌన్ సీఐ ఎస్. రాజు పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు.
గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని సీఐ తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




