Bhadrachalam: భద్రాచలం ఏరియా ఆసుపత్రికి డయాగ్నొస్టిక్ ల్యాబ్!
Bhadrachalam: భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తెలంగాణ డయాగ్నొస్టిక్ ల్యాబ్, సిటీ స్కాన్ మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్ భవనాలను పరిశీలించారు.
Bhadrachalam: భద్రాచలం ఏరియా ఆసుపత్రికి డయాగ్నొస్టిక్ ల్యాబ్!
భద్రాచలం నవంబర్ 06: నాలుగు రాష్ట్రాల ప్రజలకు అనువైన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి 24 గంటలు రోగులు వస్తూ ఉంటారని వారికి అధునాతనమైన సౌకర్యాలతో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ఆసుపత్రికి వచ్చిన రోగులు పూర్తిస్థాయిలో వైద్యం చేయించుకొని వెళ్లే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మరియు ఐటీడీఏ పిఓ బి.రాహుల్ అన్నారు.
ఈరోజు నాడు భద్రాచలం ఏరియా ఆసుపత్రిని వారు సందర్శించి ప్రభుత్వం మంజూరు చేసిన అత్యాదూతనమైన తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్, సిటీ స్కానింగ్ సదుపాయం ఏర్పాటు కొరకు అనువైన భవనాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను నేరుగా అడిగి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రి అంతటా కలియతిరిగి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను తిలకించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుండి వివిధ రకాల జబ్బులతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న CT Scan Radiology hub కు సంబంధించి అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని వారు వైద్యాధికారులకు సూచించారు. అదేవిధంగా T-Hubకు సంబంధించిన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పనులు వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు.
ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ సిబ్బంది సమన్వయంతో ఉండే నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సైదులు, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. రాజశేఖర్ రెడ్డి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, వైద్యులు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




