Bhadrachalam: నిమజ్జన వేళ యథేచ్ఛగా బెల్ట్ షాపులు - భక్తుల ఆగ్రహం
Bhadrachalam: భద్రాచలంలో వినాయక నిమజ్జన వేళ కొనసాగుతున్న బెల్ట్ షాపులు. అధికారుల హెచ్చరికలు బేఖాతర్. భక్తుల తీవ్ర ఆగ్రహం.
Bhadrachalam: నిమజ్జన వేళ యథేచ్ఛగా బెల్ట్ షాపులు - భక్తుల ఆగ్రహం
భద్రాచలం: భద్రాచల శ్రీరామ దివ్య క్షేత్రానికి గణనాధుడి నిమజ్జనానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.. గణపయ్య నిమజ్జనం సమయంలో యువకులు ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా ఉండే విధంగా అధికారులు మద్యం షాపులను మూసివేయాలని హెచ్చరించింది.
మధ్య షాపులు మూసి ఉన్న గాని బెల్ట్ షాపులో మాత్రం లభ్యమవుతుంది.. భద్రాచలం ఏషియన్ ఉదయ భాస్కర సినిమాలు సెంటర్లో ఉన్న బెల్ట్ షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయి.. ఆ బెల్ట్ షాపుల సమీపంలోని పోలీసులు ఉన్నాగాని మరోపక్క మద్యం బాబులు ఆ బెల్ట్ షాపులో మద్యం సేవిస్తూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో ఎంజాయ్ చేస్తే పర్వాలేదు కానీ గతంలో తలలు పగలగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఇదేనా సంబంధిత అధికారులు ఇచ్చిన హెచ్చరిక... మామూలు సమయలో ఎలాగో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి అవి అరికట్టడాన్ని ఏ అధికారి అడ్డుకోలేదు.. భద్రాద్రి రామయ్య సన్నిధి అంటే దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను పూర్తిచేసుకుని భద్రాచల గోదావరిలో గణనాథుడిని గోదారమ్మ ఒడిలో పంపేందుకు భక్తులు ఇష్టపడతారు.. అలాంటిది భద్రాచలం రాగానే బెల్ట్ షాపులు దర్శనం ఇవ్వడంతో పలువురు భక్తులు మండిపడుతున్నారు.




