Bhadrachalam: చర్ల మండలం కొండివాయిలో పుట్టినరోజు జరుపుకున్న గీతిక రెడ్డి!

Bhadrachalam: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం జర్నలిస్టు కర్ర అనీల్ రెడ్డి కుమార్తె గీతిక రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా చర్ల మండలం కొండివాయిలో ఆదివాసి చిన్నారులకు పండ్లు, ఆటవస్తువులు పంపిణీ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 15 Nov 2026 10:52 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: చర్ల మండలం కొండివాయిలో పుట్టినరోజు జరుపుకున్న గీతిక రెడ్డి!

భద్రాచలం నవంబర్ 14: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చర్ల మండలంలోని దట్టమైన ప్రాంతంలో జీవనం గడుపుతున్న కల్మషం లేని ఆదివాసి చిన్నారులకు భద్రాచలంకు చెందిన ప్రముఖ ప్రముఖ జర్నలిస్టు కర్ర అనీల్ రెడ్డి కుమార్తె కర్ర గీతిక రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఆనందంగా గడిపారు.

చర్ల మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన కొండివాయిలో ఆదివాసీ చిన్నారులకు శనివారం పండ్లు, మిఠాయిలు, ఆట సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీతిక రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును అటవీ గ్రామాల చిన్నారులతో జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని మిగిల్చిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. గ్రామ పెద్దలు రాజేష్, భరత్, ముఖేష్ ఆదివాసీ గ్రామస్థులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem