Bhadrachalam: అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి: న్యూడెమోక్రసీ!
Bhadrachalam: అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమించాలని చర్ల మండలం చిన్నముడిసీలేరులో జరిగిన అమరవీరుల సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి సంతపూరి సురేష్ పిలుపునిచ్చారు.
Bhadrachalam: అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి: న్యూడెమోక్రసీ!
భద్రాచలం నవంబర్ 3 - అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమించాలి. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, చర్ల మండలంలోని చిన్నముడిసీలేరు గ్రామంలో అమరవీరుల సభ సోడి జానకి అధ్యక్షతన జరిగింది ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల మండల కార్యదర్శి కామ్రేడ్ సంతపూరి సురేష్ పాల్గొని మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ఎంతోమంది విప్లవకార్లు తమ అమూల్యమైన ప్రాణాలను ప్రజల కోసం తృణ ప్రాయంగా అర్పించారని.
ఆ అమరవీరుల ఆశయాల సాధనలో మనమంతా పోరాడాలని అప్పుడే వారికి నిజమైన నివాళి అని వారన్నారు. 1976లో వెంగళరావు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పొట్ల రామనరసయ్యను జానకిరామీరెడ్డి శ్రీపాద శ్రీహరిని నారాయణను పట్టుకొని వరంగల్ జిల్లా చిలకలగుట్ట అడవిలో చిత్రహింసలకు గురిచేసి పోలీసులు కాల్చి చంపారు.
ఆదివాసి గిరిజనుల కోసం పోరాడుతున్నటువంటి విప్లవకారణం కాచినపల్లి ఎన్కౌంటర్ ముస్లిం అమరవీరులు లడాయి గడ్డ ఎన్కౌంటర్ రోల్లగడ్డ ఎన్కౌంటర్ ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని వారన్నారు. నాడు విప్లవకారులు ఆదివాసి గిరిజన పేద ప్రజల కోసం 11 లక్షల 50వేల ఎకరాల భూమిని కొట్టించి పట్టాలిపించి ఆదివాసి హక్కులను తీసుకువస్తే తీసుకువస్తే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను మొత్తం గుంజుకొని కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని ఆదివాసీలను అడవుల నుండి బయటకు పంపడం కోసం కుట్రలు పన్నుతున్నారని వారన్నారు.
ఆదివాసి గిరిజన పేద పేదల హక్కుల కోసం ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నక్సలైట్, ఆర్బన్ నక్సలైట్ ,ది మాగి నక్సలైట్ గా చిత్రీకరిస్తూ నిర్బంధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారన్నారు. ఆదివాసి పేద గిరిజన ప్రజల కోసం విప్లవకారులు పోరాడి అమరత్వం పొందారు ఆ అమరవీరుల ఆశయాలు సాధనలో ఒకటి నుండి తొమ్మిది వరకు జరిగే అమరవీరుల వర్ధంతి సభలను గ్రామ గ్రామాన జరపాలని వారి ఆశయాల సాధనలో పోరాడాలని అప్పుడే వారికి నిజమైన నివాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తుర్రం చిట్టి బాబు సత్తి శ్యామల ముతయ్య కంగాల రాజు తుర్రం వెంకటమ్మ కల్లూరి సరోజినీ రామలక్ష్మి గుండి లక్ష్మి సోడి నరసింహరావు పొడియం చిలకమ్మా శ్యామల రాములమ్మ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.




