Bhadrachalam: ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ధర్నా

Bhadrachalam: భద్రాచలంలో గిరిజన గూడేలను కాపాడాలని కోరుతూ ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ధర్నా. దేవస్థానం అధికారుల తీరుపై సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుల తీవ్ర హెచ్చరిక.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 22 Sept 2026 8:27 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ధర్నా

భద్రాచలం: శ్రీరామ నగర్ కాలనీ ధమక్కగుడాన్ని , దమ్మక్క సుందరయ్య నగర్ దగ్గర ఉన్న సమ్మక్క కాలనీలను కాపాడాలని కోరుతూ భద్రాచలం దేవస్థానం అధికారులు దూకుడు తగ్గించాలని హెచ్చరిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ఆఫీసు ముందు ఆదివాసి గిరిజనులతోని ధర్నా.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దాసరి సాయన్న పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి మునిగేల శివ ప్రశాంతు ఆదివాసి మహిళా సంఘం నాయకురాలు సావిత్రి అక్క మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు నుండి దమ్మక్కగూడెం ఇక్కడ ఉందని అక్కడ ఆదివాసి ప్రజలు నివాసిస్తున్నారని అన్నారు 800 ఎకరాలను ఆక్రమించిన ఆ భూమిపై వ్యాపారాలు చేసుకుంటున్న నోరు మెదపని అధికారులు గత నాలుగు రోజుల క్రితం దేవస్థానం భూమిలో ఇల్లు వేసుకున్న గిరిజనుల గుడిసెల పీకటానికి సరిపోరు అని అన్నారు.

ఎన్నో ఏళ్ల తరబడి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలపై అంత కుట్రలు ఎందుకు వందలు ఎకరాలు కబ్జా చేసి దర్జాగా జామాయిల్ వేసుకొని స్కూలు హాస్టల్లో నిర్మించుకొని బిజినెస్ చేస్తుంటే వారి ఆస్తులు జోలికి ఎందుకు వెళ్ళటం లేదు వారి మీద ఎందుకు అంత మమకారం అని ప్రశ్నించారు వెంటనే ఐటీడీఏ పీవో గారు స్పందించి ఇంటి స్థలం లేని గిరిజనులకు గిరినేతర పేదలకు ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రోడ్డు మంచినీళ్లు కరెంటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఇకనైనా దేవస్థానం అధికారులు చెప్పుడు మాటలు విని ఆదివాసీల జోలికి రావద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజీ సమ్మక్క దుర్గా శాంత రూప్ని ఆదిలక్ష్మి మల్లయ్య ప్రణయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem