Bhadrachalam: భద్రాద్రి రామయ్య సాక్షిగా భక్తుడి నిజాయితీ: రూ. 3.5 లక్షల బంగారు బ్రాస్లెట్ తిరిగి అప్పగింత!
Bhadrachalam: భద్రాచలం రామాలయంలో రాజమండ్రికి చెందిన భక్తుడు పోగొట్టుకున్న రూ. 3.5 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్‌ను మరో భక్తుడు నిజాయితీతో తిరిగి అప్పగించారు.
భద్రాచలం: భద్రాచలంలో శనివారం రామయ్య దర్శనానికి రాజమండ్రి నుంచి వచ్చిన వీర బ్రహ్మానంద స్వామి అనే భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను ఆయనకు దేవస్థానం అధికారులు తిరిగి అందజేశారు. రామాలయ దర్శనం సమయంలో బంగారు బ్రాస్లెట్ ను ఆయన పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో కొత్త గూడెం కి చెందిన వెంకటేశ్వర్లు అనే భక్తుడికి ఆ బంగారం దొరకగా భద్రాచలం కు చెందిన జి వెంకటేశ్వరరావు సహకారంతో దేవస్థానం అధికారులకు ఆ బ్రాస్లెట్ అందజేశారు. ఈ క్రమంలో బ్రాస్లెట్ ను పోగొట్టుకున్న వీర బ్రహ్మానంద స్వామికి ఆ ఇరువురి సమక్షంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా మరియు SPF సిబ్బంది ద్వారా వారికి అందజేశారు. వీర బ్రహ్మానంద స్వామి కి అందజేసిన బంగారు బ్రాస్లెట్ విలువ రూ.మూడున్నర లక్షలు ఉండటం విశేషం. వీర బ్రహ్మానంద స్వామి పోగొట్టు కోగా దొరికిన బంగారు బ్రాస్లెట్ ను ఆయనకు అందజేసిన వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావును దేవస్థానం అధికారులు అభినందించారు.




