Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Bhadrachalam: భద్రాచలంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అటవీశాఖ కార్యాలయం వద్ద గల పుట్టల వద్ద మహిళలు పెద్దఎత్తున పూజలు చేసి పాలు పోశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 13 Nov 2026 2:49 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

భద్రాచలం: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాగేంద్రుడి పుట్టల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని అటవీశాఖ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఏర్పడి ఉన్న పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ,నాగేంద్రుడికి పుట్టలో పాలు పోస్తూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

దీంతో అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పుట్టల వద్ద పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. ఎంతో భక్తిశ్రద్ధలతో సంతోషంగా నాగుల చవితి పూజలు నిర్వహిస్తూ ఆనందోత్సాహాల నడుమ మాతాబులు కాలుస్తూ నాగుల చవితి వేడుకను భక్త జన సందోహం నడుమ ఘనంగా నిర్వహిస్తున్నారు.

కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక పర్వ దినాలలో నాగుల చవితి కూడా ఎంతో ప్రత్యేకమైనదని ఈరోజు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నాగేంద్రుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షీరాభిషేకాలు చేస్తూ,నైవేద్యాలు సమర్పిస్తే కాల సర్ప దోషాలతో పాటు అనేక అకాల దోషాలు తొలగిపోతాయని అర్చకులు చెబుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem