Bhadrachalam: గణేష్ నిమజ్జనంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

Bhadrachalam: భద్రాచలంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా రౌడీషీటర్లకు డీఎస్పీ హెచ్చరిక. డీజేలు, మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనొద్దని స్పష్టీకరణ.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 22 Sept 2026 11:22 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గణేష్ నిమజ్జనంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

భద్రాచలం: సెప్టెంబర్ 22 భద్రాచలం పట్టణంలో గణనాధుని నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.

ఈ సందర్భంగా భద్రాచలం పట్టణ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఈ రోజు భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి గొడవలు ఘర్షణలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని

అలాగే వినాయక చవితి వేడుకలను ప్రజలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని వినాయక చవితి నిమజ్జనంలో ప్రజలు మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనవద్దని అలాగే వినాయక చవితి నిమజ్జనం ఊరేగింపులో ఎవరు కూడా DJ లు పెట్టవద్దని ప్రజలు అందరు కూడా పోలీస్ వారికీ సహకరించాలని ఈ సందర్బంగా భద్రాచలం DSP. యం. అరుణ్ కుమార్ గారు తెలిపినారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem