Bhadrachalam: భద్రాచలంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Bhadrachalam: భద్రాచలంలో శరత్ మాక్స్ విజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. క్యాటరాక్ట్ బాధితులకు ఉచిత ఆపరేషన్ల ఏర్పాట్లు చేసిన రిటైర్డ్ ఉద్యోగులు.
Bhadrachalam: భద్రాచలంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
భద్రాచలం: భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో వరంగల్ శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కంటి పరీక్షలలో క్యాట రాక్టు కలిగినటువంటి వారిని ఈరోజు శరత్ మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వారిచే వారి యొక్క సొంత వాహనంలో తీసుకువెళ్లారు. వారికి ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత తిరిగి మన భద్రాచలంలో ని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద దింపుతారని ఆల్ రిటైర్డ్ పెన్షనర్ అధ్యక్షులు బందు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, గౌరవాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, మాదిరెడ్డి రామ్మోహనరావు. ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు,T శివప్రసాద్, మురళీ కృష్ణ. సూరి శెట్టి కృష్ణ, బన్సీలాల్, శ్యామ్ సుందర్ రావు, నాళం సత్యనారాయణ పాల్గొన్నారు.
శరత్ మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్యులు శ్రీ జీవన్ గారు కుమారి డి నాగలక్ష్మి గార్లు పాల్గొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఎంతో ఓపికగా పరీక్షించి కంటి వైద్య పరీక్షలు చేసినందుకు వారికి భద్రాచలం రిటైర్డ్ ఎంప్లాయిస్ కృతజ్ఞతలు తెలిపారు.




