Bhadrachalam: భద్రాచలంలో పుష్కర ఘాట్లు, రోడ్ల తనిఖీ: మృణాల్ శ్రేష్ఠ!
Bhadrachalam: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఘాట్లు, రోడ్డు మార్గాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
Bhadrachalam: భద్రాచలంలో పుష్కర ఘాట్లు, రోడ్ల తనిఖీ: మృణాల్ శ్రేష్ఠ!
భద్రాచలం నవంబర్ 3: వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా దేశ నలుమూలల నుండి శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైయున్న భద్రాచలంకు భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉన్నందున వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి ఇప్పటి నుండే సౌకర్యాలు ఏర్పాట్ల కొరకు ముఖ్యమైన స్థలాలను పరిశీలించడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.
ఈరోజు ఆర్ అండ్ బి ఏ ఈ ఈ, ఈవో గ్రామపంచాయతీ సంబంధిత అధికారులతో కలిసి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా గోదావరిలో స్నానాలు చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా సౌకర్యాలు కల్పించుటకు ముఖ్యమైన స్థలాలను, రోడ్డు మార్గాలను పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తులు భద్రాచలం సురక్షితంగా చేరుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్లడానికి ఆలయం చుట్టూ ఉన్న వివిధ రోడ్డు మార్గాలను( ఎన్ హెచ్-30 నుంచి గోదావరి ఘాటుల వైపు వెళ్లే రహదారి కరకట్ట రోడ్డు చప్ట దిగువ రహదారి అన్నదాన సత్రం ప్రాంతం) లను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఆయన పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాలకు వచ్చే భక్తుల కొరకు బస్సు చేయడానికి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు.




