Bhadrachalam: 150 కి.మీ పాదయాత్రగా వచ్చిన రామభక్తులకు ఘన స్వాగతం

Bhadrachalam: ఏలూరు జిల్లా కండ్రిగగూడెం నుంచి 150 కిలోమీటర్లు పాదయాత్రగా భద్రాచలం చేరుకున్న రామభక్తులకు కాంగ్రెస్ నేత పరిమి శ్రీనివాసరావు అల్పాహారం అందించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 17 Nov 2026 4:25 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: 150 కి.మీ పాదయాత్రగా వచ్చిన రామభక్తులకు ఘన స్వాగతం

భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కండ్రిగగూడెం గ్రామం నుంచి సుమారు 150 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చిన రామభక్తులకు భద్రాచలం పట్టణంలో ఘన స్వాగతం పలికారు. భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రామభక్తులకు ప్రత్యేకంగా అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతం నుంచి కాలినడకన వచ్చిన భక్తులకు ఆత్మీయంగా అల్పాహారం అందించి తమ భక్తిభావాన్ని, సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పరిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ... గత తొమ్మిదేళ్లుగా రామభక్తులు పాదయాత్రగా భద్రాచలం వస్తున్న సందర్భంగా వారికి అల్పాహారం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఏటా భక్తిశ్రద్ధలతో భద్రాచలం చేరుకుంటున్న రామభక్తులకు ఆతిథ్యం అందించడం ద్వారా సేవాభావాన్ని చాటుకుంటున్న పరిమి శ్రీనివాసరావును పలువురు అభినందించారు. భక్తి మార్గంలో పయనించే భక్తులకు సేవ చేయడమే నిజమైన భగవత్ సేవ అని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem