Bhadrachalam: భద్రాద్రి హరిహర క్షేత్రంలో ఘనంగా అయ్యప్ప దీక్షా మాలధారణ!
Bhadrachalam: కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి హరిహర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నె స్వాములు పెద్ద సంఖ్యలో మాలధారణ చేపట్టారు. 4 వేలకు పైగా భక్తులు దీక్ష స్వీకరించారు.
Bhadrachalam: భద్రాద్రి హరిహర క్షేత్రంలో ఘనంగా అయ్యప్ప దీక్షా మాలధారణ!
భద్రాచలం నవంబర్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల దివ్య క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శబరిమలై గా విరాజిల్లుతున్న భద్రాద్రి, హరిహర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప స్వామి దీక్ష మాలదరణ చేపట్టారు. ఇప్పటివరకు ఈ యొక్క భద్రాద్రి హరి హర క్షేత్రంలో సుమారు నాలుగువేలకు పైగా భక్తులు దీక్ష చేపట్టారు.
ఈ సంవత్సరం ఎక్కువగా కన్నె స్వాములు దీక్ష చేపట్టినట్లు ఆలయ కమిటీ తెరిపింది. భద్రాద్రి హరి హర క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో శబరిమలై లో జరిగే పూజా విధానాలు ఇక్కడ చేపడుతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ప్రతి బుధవారం దీక్షాపరులకు 3000 పైగా అయ్యప్ప దీక్ష పరులు గాని, వారితో పాటు వచ్చే వారి కుటుంబ సభ్యులకు కూడా అన్న ప్రసాదం అందిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన గురు స్వాములు దీక్ష చేపట్టే ప్రతి ఒక్క భక్తులకి అయ్యప్ప దీక్ష నియమాలను పాటించాలని తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యాస్తవానికి ముందు శరణు ఘోశపూర్తి చేసుకోవాలని. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ఆలయానికి వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.




