Bhadrachalam: తల్లిదండ్రులు లేని ఆదివాసీ విద్యార్థికి అండగా ఐటీడీఏ భద్రాచలం

Bhadrachalam: తల్లిదండ్రులు లేని ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్‌కు భద్రాచలం ఐటీడీఏ అండ. ఎంబీబీఎస్ చదువు కోసం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.60 వేల ఆర్థిక సాయం అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 6:35 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: తల్లిదండ్రులు లేని ఆదివాసీ విద్యార్థికి అండగా ఐటీడీఏ భద్రాచలం

భద్రాచలం: ములకలపల్లి మండలం, సీతాయిగూడెం గ్రామానికి చెందిన కోయ ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్ తల్లిదండ్రులు లేకపోయినా, తన కష్టంతో చదువుకుని NEETలో 424 మార్కులు సాధించాడని అలాగే కోదాడ మండలం కొత్తగూడెం తండాకి చెందిన భూక్యవాసిని ఎంబిబిఎస్ లో సీట్లు సాధించారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.

సోమవారం నాడు తన ఛాంబర్ లో ఎంబిబిఎస్ లో సీట్లు సాధించిన సాధించిన నక్క సంతోష్ కు 60 వేలు భూక్యవాసిని కు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు లేకపోయినా పట్టుదలతో చదివి నీట్ లో 424 మార్కులు నక్క సంతోష్, 474 మార్కులు సాధించిన భూక్యవాసిని ఎంబిబిఎస్ లో సీటు సంపాదించిందని అన్నారు.

నక్క సంతోష్ ఆర్థిక స్తోమత లేక ఎంబిబిఎస్ కోర్సు చేయలేకపోతున్నట్లు కొన్ని పత్రిక కథనాల ద్వారా నా దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ద్వారా ఆ విద్యార్థి వినిపించిన విషయాలు తెలుసుకొని వెంటనే ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుండి 60 వేల రూపాయల చెక్కును అలాగే కడు పేదరికముతో చదువులో వెనకడుగు వేయకుండా పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించిన భూక్యవాసినికి ఎంబిబిఎస్ కోర్సు నిమిత్తం 50 వేల రూపాయల చెక్కును అందించడం జరిగిందని ఆయన అన్నారు.

ఒక గిరిజన తెగకు చెందిన విద్యార్థిని మరియు విద్యార్థి డాక్టర్ కావాలనే కుతూహలముతో పట్టుదలగా చదివి ఎంబిబిఎస్ లో సీటు సంపాదించడంతో వారి చదువుకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఆయన అన్నారు.

నక్క సంతోష్ ఎంబిబిఎస్ చదువుకు ఆర్థిక సహాయం అందించాలని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పిఓ దృష్టికి తీసుకొని వెళ్లగా ఐటీడీఏ పీవో వెంటనే స్పందించి గంట వ్యవధిలోనే 60 వేల రూపాయల చెక్కును అందించి పెద గిరిజన విద్యార్థి డాక్టర్ కోర్స్ కు తోడ్పాటు అందించినందుకు ప్రత్యేకంగా ఆదివాసీ సంఘాలు, నాయకులు పలువురు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, ముర్ల రమేష్, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, మిడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story