Bhadrachalam: నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు: ఐటీడీఏ పీవో రాహుల్
Bhadrachalam: గిరిజన సంక్షేమ గురుకుల నాన్-టీచింగ్ సిబ్బందికి ప్రమోషన్లు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసిన పీవో బి. రాహుల్.
Bhadrachalam: నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు: ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్-టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి పదోన్నతి అర్హత పత్రాలు అందించినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం నాడు తన ఛాంబర్ లో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి. పృధ్వి రాజుకు జూనియర్ అసిస్టెంట్‌గా, ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బి. కిరణ్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్‌లకు ల్యాబ్ అసిస్టెంట్లుగా, కె/హెచ్‌గా పనిచేస్తున్న పి. రామదాస్‌కు ల్యాబ్ అసిస్టెంట్‌గా, ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బి. నాగరాజుకు రికార్డ్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించి, ఆయా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో నియమించడం జరిగిందని ఆయన అన్నారు.
పదోన్నతులు పొందిన ఉద్యోగులు తమకు కేటాయించిన సంస్థల్లో విధుల్లో వెంటనే చేరాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, గురుకులం ఏవో నరేందర్, పదోన్నతి పొందిన నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




