Bhadrachalam: పోషణే ప్రగతికి పునాది.. అంగన్‌వాడీలకు ఐటీడీఏ పీవో కీలక పిలుపు!

Bhadrachalam: పోషణే ప్రగతికి పునాది అని భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ అన్నారు. భద్రాచలంలో పోషణ మాసోత్సవ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 10 Sept 2026 3:43 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: పోషణే ప్రగతికి పునాది.. అంగన్‌వాడీలకు ఐటీడీఏ పీవో కీలక పిలుపు!

భద్రాచలం: పిల్లలు గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు మరియు మహిళల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు పని చేయాలని ఐటీడీఏ పీవో ఐఏఎస్ అధికారి బి రాహుల్ పిలుపునిచ్చారు.

స్థానిక భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పోషణ మాస ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంవత్సరం నినాదం అయినటువంటి మన అంగనవాడి మన బాధ్యత అని దానికి అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించి అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ పోషణ అభియాన్ సిబ్బంది అంగన్‌వాడీ సిబ్బంది సంబంధిత శాఖల సమన్వయంతో నెలరోజుల పాటు వివిధ పోషణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించే సత్ఫలితాలు రాబట్టాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని జే.స్వర్ణలత లెనీనా మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని తగ్గించడం, ప్రతి కుటుంబానికి సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయడం, పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని

ప్రత్యేకంగా మొదటి 1,000 రోజులు, అంటే గర్భధారణ నుంచి చిన్నారి జీవితంలోని తొలి సంవత్సరాలు అత్యంత కీలకమైనవిగా గుర్తించి తల్లులు కుటుంబ సభ్యులకు సరైన పోషకాహారం ఆరోగ్యం పరిశుభ్రత మరియు శిశు సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు

పోషణ మాసం విజయవంతం కావాలంటే ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రతి తల్లి తన బిడ్డకు సరైన పోషకాహారం అందించడంతో పాటు ప్రతి కుటుంబం పోషక విలువలు కలిగిన స్థానిక ఆహార పదార్థాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem