Bhadrachalam: గురుకుల డిగ్రీ కాలేజీల తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల

Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీల తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల. ఈ నెల 15లోపు అభ్యంతరాలు తెలపాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ వెల్లడి.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 11 Sept 2026 6:08 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: గురుకుల డిగ్రీ కాలేజీల తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల

భద్రాచలం: 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఖమ్మం రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యాలయాలలో తాత్కాలిక ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకానికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సమర్పించిన వివరాలు మరియు అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తాత్కాలిక మెరిట్ జాబితాలు సిద్ధం చేయబడినదని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాత్కాలిక మెరిట్ జాబితాలను పరిశీలించి, తమ పేరు, విద్యార్హతలు, మెరిట్, SET/NET & Ph.D లేదా ఇతర సంబంధిత వివరాలలో ఏమైనా అభ్యంతరాలు / తప్పులు ఉన్నట్లయితే, తగిన ఆధారాలతో తమ అభ్యంతరాలను సమర్పించ చెప్పగలరని ఆయన అన్నారు.

అభ్యంతరాలను ఈనెల 15వ తేదీన ఐ టి డి ఏ కార్యాలయంలో నేరుగా సమర్పించవలెనని ఆయన అన్నారు. అభ్యంతరాలను సమర్పించే అభ్యర్థులు తమ అభ్యంతరానికి సంబంధించిన ధ్రువపత్రాల నకళ్లను తప్పనిసరిగా జతపరచవలెనని,నిర్ణీత గడువు అనంతరం అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబడవని ఆయన అన్నారు.అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, అర్హత మరియు సంబంధిత నియామక నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టబడునని ఆయన అన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem