Bhadrachalam: భూ ఆక్రమణలపై పూనెం ప్రదీప్ ఒక్కరోజు నిరసన దీక్ష!
Bhadrachalam: భద్రాచలంలో భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా పూనెం ప్రదీప్ నిరాహార దీక్ష. సిపిఐ(ఎం-ఎల్), ఎమ్మార్పీఎస్, మాల మహానాడు ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు.
Bhadrachalam: భూ ఆక్రమణలపై పూనెం ప్రదీప్ ఒక్కరోజు నిరసన దీక్ష!
Bhadrachalam: పట్టణంలో సాగుతున్న భూకబ్జాలు, అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఉద్యమ బాట పట్టారు. పట్టణంలోని విలువైన భూములు, ఫుట్పాత్లు, డ్రైనేజీలు మరియు చెరువులను కొందరు స్వార్థపరులు, అవినీతి రాజకీయ నాయకులు ఆక్రమిస్తున్నారంటూ వాటిని అడ్డుకునేందుకు సామాజిక హక్కుల కార్యకర్త పూనెం ప్రదీప్ ఆధ్వర్యంలో ‘ఒక్కరోజు నిరసన నిరాహార దీక్ష’కు పిలుపునిచ్చారు.
మన భద్రాచలం.. మనం పాలకులం’"ఈరోజు 'నాకెందుకులే' అని మౌనంగా ఉంటే.. రేపు మన ఇళ్లు, స్థలాలు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త!" అని పూనెం ప్రదీప్ హెచ్చరించారు. భద్రాచలాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని, పార్టీలకు అతీతంగా మేధావులు, ప్రజా సంఘాలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నేడు మనం ఇచ్చే మద్దతే మన భావితరాల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని స్పష్టం చేశారు.ప్రజా సంఘాలు, పార్టీల సంపూర్ణ మద్దతు
ఈ పోరాటానికి పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పూర్తి సంఘీభావం ప్రకటించాయి. సిపిఐ (ఎం-ఎల్) పార్టీ, మాల మహానాడు, ఎమ్మార్పీఎస్ (MRPS) తదితర సంఘాల ప్రతినిధులు ఈ నిరసన దీక్షకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. భద్రాచలం పరిరక్షణే ధ్యేయంగా జరిగే ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.




