Bhadrachalam: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: భద్రాచలం ఎంఈవో శ్రీనివాసరావు!

Bhadrachalam: భద్రాచలం మండలంలోని శిల్పినగర్, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడుతున్నారని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 10 Sept 2026 5:17 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: భద్రాచలం ఎంఈవో శ్రీనివాసరావు!

భద్రాచలం సెప్టెంబర్ 10: భద్రాచలం మండలంలోని శిల్పి నగర్ ప్రాథమిక పాఠశాల,కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చాలా చురుకుగా ఉత్సాహంగా గుణాత్మకమైన విద్య అభ్యసనతో ప్రైవేట్ స్కూలు విద్యార్థులతో పోటీకి మేము సైతం 'సై'అంటున్నారని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అన్నారు.ఈరోజు భద్రాచలం పట్టణంలోని శిల్పి నగర్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి పరంగా అనేక శిక్షణలలో నిమగ్నమై విద్యార్థి కేంద్రంగా తరగతి అభ్యసనా సామర్థ్యాల దిశగా పనిచేసిన ఉపాధ్యాయులతో సమగ్ర బోధనతో శిక్షణ తీసుకున్న మేము సైతం ఏ పోటీకైనా సిద్ధం అని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రెండు పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, పచ్చదనం పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నిర్వహణ ఎఫ్ ఎల్ ఎన్ నిర్వహణ రెమిడీయల్ క్లాసెస్ నిర్వహణ బేస్ లైన్ పరీక్ష నిర్వహణ సంతృప్తిగా నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయుల కృషిని ఎంఈఓ అభినందించారు.

నేపథ్యంలో ప్రాథమిక స్థాయి పిల్లలకు ఎఫ్ఎల్ఎం మరియు 6,7 తరగతుల విద్యార్థులకు లిప్ లో ఉపాధ్యాయులు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహించి కనీస అభ్యసన సామర్ధ్యాలకు శ్రీకారం చుట్టుతున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల రిసోర్స్ పర్సన్ T. రామకృష్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయిని *కృష్ణకుమారి, ఉపాధ్యాయని స్రవంతి, స్వచ్ఛ మిత్ర సేవకురాలు మధ్యాహ్న భోజన నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem