Venkatapuram: ఐఈడీ పేలుడు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!

Venkatapuram: వెంకటాపురం కర్రిగుట్ట వద్ద ఐఈడీ పేలుడులో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 3:40 PM IST
Venkatapuram
X

Venkatapuram: ఐఈడీ పేలుడు బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!

Venkatapuram: వెంకటాపురం మండలం కర్రిగుట్ట సమీపంలో నిన్న జరిగిన విషాదకర ఐఈడీ పేలుడు ఘటనలో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు పరామర్శించారు.

వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లిన సమయంలో ఐఈడీ పేలడంతో మడకం నాగేశ్వరరావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు వెంకటాపురం మండలానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి, మనోధైర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story