Bhadrachalam: భద్రాచలంలో బీద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ రామాయణ పారాయణ సేవాసమితి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బీద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 15 Nov 2026 10:49 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో బీద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ!

భద్రాచలం నవంబర్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ రామాయణ పారాయణ సేవాసమితి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో నెలవారి నిత్యావసర వస్తువుల వితరణ కార్యక్రమం జరిగింది.

కరోనా కాలం నుంచి బీద బ్రాహ్మణ కుటుంబాలకు మరియు ఇతర కుటుంబాలకు రామాయణ పారాయణ సేవా సమితి వారు ప్రతినెల నిత్యవసర వస్తువులను పంచిపెడుతున్నారు. ఇప్పటివరకు 61 నెలలు పూర్తయినట్లు వారు తెలిపారు. 19-11-2021 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఈ రామాయణ పారాయణా సేవా సంస్థ వారు పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించి ఆదుకున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem