Bhadrachalam: చాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి

Bhadrachalam: భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నిబంధనల మేరకు న్యాయబద్ధంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నేత రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్ చేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 19 Nov 2026 7:26 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: చాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి

భద్రాచలం: భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలని, ఏకపక్ష నిర్ణయాలు సబబు కాదని , వ్యాపార వర్గాలు కలిసి ఉండాలని బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ రావులపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నిర్వహణలో గత పదేళ్లుగా సందిగ్ధత నెలకొనడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ఇటీవల ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు పూనుకున్నప్పటినుంచి జరుగుతున్న పరిణామాలు ఒక వర్గానికి కొమ్ముకాస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని 'రావులపల్లి" అభిప్రాయం వ్యక్తం చేశారు.

నామినేషన్ ప్రక్రియ జరిగి, స్క్రూట్ నీ ముగిసి, గుర్తులు కేటాయించే సమయంలో కొందరిని ఎన్నికల పోటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో సంస్థల ఎన్నికలు చూసామని, ఇటువంటి చిత్రమైన నిర్ణయాలు ఎన్నడూ...ఎక్కడ లేవన్నారు.

రిజిస్టర్ కమిటీలో అందరికీ హక్కులు ఉంటాయని ఇది గమనించాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలోనే కొంత అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రిజిస్టర్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే..రెవిన్యూ అధికారులకు సమాచారం అందించాలని, అటువంటిదేమీ చేయకపోవడం ఎన్నికల కమిటీకి అవగాహన రాహిత్యమేనని ఆయన దుయ్యబట్టారు.

ఎన్నికల నిబంధనలను అడుగడుగున తుంగలో తొక్కారని, తమవారిని అందలం ఎక్కించేందుకే కుట్రలు జరిగాయని వెల్లడించారు. వ్యాపార వర్గాలు విజ్ఞతతో ఆలోచించాలని, ఇటువంటి కుయుక్తులను తిప్పి కొట్టాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని 'రావులపల్లి' ఆకాంక్షించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem