Bhadrachalam: ఆర్టీసీ మంత్లీ సీజన్ టికెట్లపై మరింత రాయితీ
Bhadrachalam: భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జంగయ్య ప్రకటన; 2, 3 నెలల బస్ పాస్‌లపై అదనపు రోజులు, మహిళలకు డీలక్స్ పాస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో 10% రాయితీ.
Bhadrachalam: ఆర్టీసీ మంత్లీ సీజన్ టికెట్లపై మరింత రాయితీ
భద్రాచలం: ఇప్పుడు RTC బస్సు ల్లో ప్రతీ రోజు ప్రయాణించేవరికి శుభవార్త, ఇప్పటివరకు మంత్లీ సీజన్ టికెట్స్ పై ఇస్తున్న రాయితీని మరింత పెంచిన RTC. రెండు నెలలు Na PASS ఒకేసారి తీసుకొన్నవారికి అదనంగా 5 రోజులు రాయితీ వర్తింప చేస్తున్నట్లు భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జంగయ్య శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
అంటే 40 రోజుల చార్జీ పై 65 రోజులు ప్రయాణించ వచ్చునని అలాగే 3 నెలల PASS ఒకేసారి తీసుకుంటే ఏకంగా 10 రోజుల పాటు అదనపు రాయితీ ఇవ్వనున్నట్లు అంటే 60 రోజుల చార్జీ తో ఏకంగా 100 రోజులపాటు ఉచితంగా ప్రయాణించవచ్చునని,మహిళల కోసం డీలక్స్ బస్సు ల్లో 15 రోజుల చార్జీ తో నెల ప్రయాణం చేయవచ్చునని,ఇంతే కాదు ఈ మంత్లీ సీజన్ టికెట్స్ (MST )కొన్నవారు ఆర్డినరీ పాస్ ఉంటే 20 రూపాయలు కాంబినేషన్ టికెట్ కొని ఎక్సప్రెస్ బస్సు ల్లో ప్రయాణించవచ్చునని అలాగే EXPRESS పాస్ వున్నవారు అదనంగా 20 రూపాయలు కాంబినేషన్ టికెట్ కొని డీలక్స్ బస్సు ల్లో ప్రయాణించవచ్చు నని,అంతే కాకుండా ఈ MST కలిగినవారు ఇతర రూట్లలో ప్రయాణించేటప్పుడు సూపర్ లగ్జరీ, AC బస్సుల్లో వీరికి 10 శాతం రాయితీ కూడా లభిస్తుందని ఆయన అన్నారు.
ఈ అవకాశాన్ని బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు.




