Bhadrachalam: భద్రాచలంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

Bhadrachalam: భద్రాచలం సబ్ కలెక్టరేట్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా. పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Aug 2026 7:19 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

భద్రాచలం: స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామంటూ చేస్తామంటూ భద్రాచలం సబ్ కలెక్టరేట్ ముందు భద్రాచలం పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ అధ్యక్షతన సబ్ కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం విద్యార్థులతో జరిగింది.

పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే విడుదల చేయాలి.విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసి వేధిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని A,O భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బయ్య అభిమన్యు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,814 కోట్ల స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని, ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలల్లోనే నిలిపివేసి తీవ్రంగా వేధిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపడం అన్యాయమన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు కాగా, వాటిని విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు,మెమోలు, ఇతర విద్యా పత్రాలను కళాశాలలు తమ వద్ద ఉంచుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల సర్టిఫికెట్లను ఎలాంటి షరతులు లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేసే విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.ప్రభుత్వం విద్యార్థుల చదువును బాధ్యతగా చూడాలి తప్ప, ప్రైవేట్ కళాశాలల ఆర్థిక ప్రయోజనాలకు విద్యార్థులను బలిచేయకూడదని అన్నారు. పెండింగ్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధాన వైఫల్యానికి నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విడుదల చేసే విధంగా శాశ్వతమైన నిధుల విడుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాదాసు అఖిల్, జిల్లా కమిటీ సభ్యులు కేసుపాక సందీప్, ముదిగొండ ప్రశాంత్ , నాయకులు సాయి కిరణ్ , నూప రవికుమార్, సెనగవరపు సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story