Bhadrachalam: భద్రాచలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో Gen Z ఉద్యమ అవగాహన సదస్సు!
Bhadrachalam: భద్రాచలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 'జెన్ జి' ఉద్యమ అవగాహన సదస్సు నిర్వహించి, విద్యార్థులు సమస్యలపై ప్రశ్నించాలని వక్తలు పిలుపునిచ్చారు.
Bhadrachalam: భద్రాచలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో Gen Z ఉద్యమ అవగాహన సదస్సు!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 30 - ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని విద్యార్థులు ఇటువంటి ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని ప్రశ్నించే తత్వాన్ని పోరాడే స్ఫూర్తిని అలవర్చుకోవాలని పూర్వ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన Gen Z అవగాహన సదస్సులో ముఖ్య వక్తలుగా ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్,మథర్ థెరిస్సా డిగ్రీ కళాశాల డైరెక్టర్ తోటమల్ల రమణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ భద్రాచలం పట్టణ కార్యదర్శి కొప్పుల రవీందర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో లో వారు మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని అన్నారు.
విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సమాజంలోని సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రశ్నించే ధైర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. Gen Z తరం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, సామాజిక సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించడం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ గొంతును వినిపించడం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. విద్య, ఉపాధి, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు వంటి విద్యార్థుల సమస్యలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థి ఉద్యమాలు సమాజంలో మార్పుకు దోహదపడతాయని, చరిత్రలో అనేక సందర్భాల్లో విద్యార్థులు ప్రజా సమస్యలపై ముందుండి పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నించడం విద్యార్థుల బాధ్యత అని అన్నారు.
ప్రస్తుత Gen Z తరం అంతర్జాల పోరాటం తో పాటు బహిరంగ పోరాటాలకు కూడా నాయకత్వం వహించిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుందని, విద్యార్థుల హక్కుల కోసం జరిగే పోరాటాల్లో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, నికిత,పద్మ, అంజలి, రాణి,లక్ష్మీ ప్రసన్న, సాహుల్, ప్రశాంత్, కిషోర్, నారాయణ,తదితరులు పాల్గొన్నారు.




