Bhadrachalam: బీసీ గురుకుల కళాశాలలో కంప్యూటర్లు, మెటీరియల్ అందజేత

Bhadrachalam: భద్రాచలం బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో ఐటీసీ సీఎస్ఆర్ ద్వారా డెస్క్‌టాప్‌లు, ఐఐటీ-నీట్ స్టడీ మెటీరియల్ అందజేత. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పర్యవేక్షణ.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 12 Sept 2026 8:18 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: బీసీ గురుకుల కళాశాలలో కంప్యూటర్లు, మెటీరియల్ అందజేత

భద్రాచలం: భద్రాచలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల (బాలికల)ను కళాశాలకు సంబంధించిన సమస్యలను కళాశాల సిబ్బంది తన దృష్టికి తీసుకురావడం జరిగిందని సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ట అన్నారు.

ఈరోజు ఆయన బీసీ వెల్ఫేర్ కళాశాలలో విద్యార్థులకు విద్యా వాతావరణాన్ని, సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి సబ్-డివిజనల్ పరిపాలన విభాగం ఐటీసీ (ITC)తో భాగస్వామ్యం చేసుకొని విద్యకు సంబంధించిన వారికి కావలసిన మెటీరియల్

ఐటీసీ తన సీఎస్ఆర్ (CSR) కింద డెస్క్‌టాప్‌లు, కంప్యూటర్ ల్యాబ్ ఫర్నిచర్, అదనపు డెస్క్‌లు మరియు బెంచీలను అందించామని అన్నారు.మెటీరియల్ తో పాటు కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వాటికి సంబంధించిన ఐఐటీ-జేఈఈ (IIT-JEE) & నీట్ (NEET) ప్రిపరేషన్ వనరులను కూడా విద్యార్థులకు అందించడం జరిగిందని అన్నారు.

కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని, ఐఐటీ-జేఈఈ & నీట్ పరీక్షలలో జాతీయ స్థాయి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అధ్యాపకులను, విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ జిఎం చంగల్ రావు మరియు అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem