Bhadrachalam: భూ రీసర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి!
Bhadrachalam: చర్ల మండలం గోగుపాకలో భూ రీసర్వే పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తనిఖీ చేసి, మార్గదర్శకాల ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Bhadrachalam: భూ రీసర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి!
భద్రాచలం: భూ రీసర్వే లో భాగంగా భూముల వివరాలు, సరిహద్దులు, సర్వే మ్యాప్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని, భూ రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్దేశిత ప్రణాళిక ప్రకారము ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు. ఈరోజు చర్ల మండలం గోగుపాక గ్రామంలో జరుగుతున్న పునసర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం పట్టాదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే తహసిల్దార్ సర్వేయర్ గిర్ధవర్ జిపిఓ లు మరియు లైసెన్స్ పొందిన సర్వేయర్ల నుండి గ్రామాలలో జరుగుతున్న రీ సర్వే పనులకు సంబంధించిన వివరాలను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అనంతరం గ్రామంలోని ఎంజాయ్మెంట్ సర్వే( భూ వినియోగ సర్వే) పునః పరిశీలన పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరుగుతున్న భూరి సర్వే పనులు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితమైన మరియు సరైన భూ రికార్డుల నిర్వహణను నిర్ధారిస్తూ నిర్ణీత గడువులోగా సర్వే పనులను పూర్తి చేయాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని సర్వేయర్ బృందానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ నరసింహారావు, సర్వేయర్ రాజబాబు మరియు జి పి ఓ లు రెవెన్యూ స్థాయి అధికారులు, లైసెన్స్ పొందిన సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.




