Bhadrachalam: భద్రాచలంలో గోదావరి పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయాలి!

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదేశించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 5 Nov 2026 7:44 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయాలి!

Bhadrachalam: భద్రాచలం రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో సంబంధించిన అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం సాయంత్రం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇస్తూ 2027 జూన్, జూలై మాసంలో జరిగే గోదావరి పుష్కరాలు సందర్భంగా మాట్లాడుతూ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు కమిషనర్ సూచనలు మేరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పుష్కరాల కోసం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఘాట్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైయున్న భద్రాచలంకు గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన తాగునీటి సరఫరాకు పక్కా ప్రణాళిక రూపొందించాలని, పుష్కర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఘాట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు రూపొందించుకొని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem