Bhadrachalam: భద్రాచలంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రం ప్రారంభం!
Bhadrachalam: భద్రాచలం మిథిలా ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన ఆలయ ఈవో దామోదర్. త్వరలోనే అక్కడే సేవా టిక్కెట్ల విక్రయం.
Bhadrachalam: భద్రాచలంలో భక్తుల కోసం ప్రత్యేక సమాచార కేంద్రం ప్రారంభం!
Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మిథిలా ప్రాంగణం వద్ద భక్తుల సమాచారం నిమిత్తం. ప్రత్యేకంగా ఒక సమాచార కేంద్రాన్ని ఆలయ ఈవో దామోదర్ ప్రారంభించారు.ఈ సమాచార కేంద్రంలో స్వామివారి దర్శనార్థమయ్యే వచ్చు భక్తులు ఆలయం సంబంధించి అన్ని సమాచారాలను తెలుసుకొనే సదుపాయాన్ని కల్పించి రాబోవు రోజుల్లో అక్కడే వివిధ సేవల టిక్కెట్లను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు సమాచార కేంద్రాన్ని సంప్రదించి వారికి అవసరమైన సమాచారమును పొంది శ్రీ సీతారమచంద్ర స్వామి వారి కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏఈవోలు సూపర్డెంట్లు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




