Bhadrachalam: గోదావరి పుష్కరాల నాటికి ఘాట్ల నిర్మాణాలు సిద్ధం చేయాలి!
Bhadrachalam: భద్రాచలం రామాలయ పునరుద్ధరణ పనులను ముక్కోటి ఏకాదశి, గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ అధికారులను ఆదేశించారు.
Bhadrachalam: గోదావరి పుష్కరాల నాటికి ఘాట్ల నిర్మాణాలు సిద్ధం చేయాలి!
Bhadrachalam: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులు అలాగే గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి గోదావరి ఘాట్ అభివృద్ధి పనులు భక్తులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు పూర్తిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ,అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సూచించిన ప్రకారము అలాగే దేవస్థానం ఆగమ శాస్త్రం పండితులు సూచించిన విధంగా దేవాలయం అభివృద్ధి పనులు అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న సమయం కంటే ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్స్ , ఆర్కిటెక్చర్లు సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా దర్శనం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది 2027 జూన్ - జులై నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.




