Burgampahad: అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా బూర్గంపాడు!
Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Burgampahad: అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా బూర్గంపాడు!
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూర్గంపాడు, సారపాక, ఉప్పుశాఖ, బుడ్డగూడెం గ్రామాల పరిధిలో కొందరు అక్రమార్కులు ఇసుక రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార పార్టీ పేరును అడ్డం పెట్టుకొని అక్రమ దందాకు తెరలేపుతున్నారా? రాజకీయ అండదండలున్నాయనే ధీమాతోనే ఈ వ్యవహారం సాగుతోందా? నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయనే ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎందుకు సమగ్ర విచారణ చేపట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా, అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వాహనాలకు అనుమతులు ఉన్నాయా? రాజకీయ అండదండలు నిజమేనా? జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఇసుక రవాణాపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్య.




