Karakagudem: కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు

Karakagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురంలో మృతిచెందిన కాంగ్రెస్ నాయకుని కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేసి భరోసా కల్పించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 13 Nov 2026 3:49 PM IST
Karakagudem
X

Karakagudem: కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు

కరకగూడెం: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పోలేబోయిన సీతారాం బాబు గారి సోదరులు పోలేబోయిన ఆదినారాయణ ఇటీవల మరణించగా, వారి దశదిన కర్మల నిమిత్తం కుటుంబ సభ్యులకు 75 కేజీల బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు 25 కేజీలు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు గారు 25 కేజీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూనెం శ్యాం కుమారి గారు 25 కేజీల బియ్యాన్ని అందజేసి బాధిత కుటుంబానికి తమ వంతు సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ రఫీ గారు, సతీష్ గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA