Kothagudem: భద్రాద్రి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి సమ్మిళిత శిబిరాలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్టోబర్ 21 నుండి డిసెంబర్ 31 వరకు ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జె.అంకిత్ తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 18 Oct 2026 6:17 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి సమ్మిళిత శిబిరాలు!

Kothagudem: కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగం (DFS) ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల (ULB) పరిధిలో "ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం" (Financial Inclusion Saturation Campaign) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, ఐ.ఏ.ఎస్. తెలిపారు.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాల కవరేజీని పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, సామాజిక భద్రతా సేవలు అందేలా చూడటమే ఈ ప్రచార లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

శిబిరాల్లో లభించే సేవలు:

* PMJJBY, PMSBY, APY పథకాల్లో అర్హులైన వారి నమోదు

* PMJJBY, PMSBY ఖాతాలకు ఆధార్ సీడింగ్ (పెండింగ్‌లో ఉన్నచోట)

* బ్యాంకు ఖాతా లేని అర్హులకు, PVTG కుటుంబాలకు PMJDY ఖాతాలు తెరవడం.

* నిష్క్రియంగా ఉన్న PMJDY ఖాతాల పునరుద్ధరణ

* PMJDY, ఇతర పొదుపు ఖాతాలకు రీ-కేవైసీ పూర్తి చేయడం

* సెంట్రల్ కేవైసీ (C-KYC) ఐడీల జనరేషన్.

* పొదుపు ఖాతాలు, లాకర్లకు నామినీ వివరాల నమోదు/నవీకరణ

* ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు, డిజిటల్ మోసాల నివారణపై అవగాహన కల్పించడం.

* "ఆప్కీ పూంజీ, ఆప్కా అధికార్" అవగాహన కార్యక్రమం: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై (బ్యాంకు డిపాజిట్లు, బీమా మొత్తాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు తదితరాలు) ప్రజలకు అవగాహన కల్పించడం.

* PM-కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC): అర్హులైన PM-కిసాన్ లబ్ధిదారులందరికీ KCC అందేలా దరఖాస్తుల సేకరణ.

* ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) నమోదు: రాబోయే రబీ సీజన్‌కు KCC ఖాతాల సంతృప్తత లక్ష్యంగా రైతుల PMFBY నమోదు.

* RBI యొక్క UDGAM పోర్టల్, IRDAI యొక్క బీమా భరోసా పోర్టల్, SEBI యొక్క MITRA ప్లాట్‌ఫామ్ పై అవగాహన కలిగించడం.

ప్రచార కాలంలో ప్రతి గ్రామ పంచాయతీ/ULB లో కనీసం ఒక శిబిరం నిర్వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బ్యాంక్ శాఖను కేటాయించి, శిబిరాల షెడ్యూల్‌ను అన్ని విభాగాలకు, బ్యాంకులకు ఇప్పటికే పంపడం జరిగింది.

లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) జిల్లా స్థాయి నోడల్ అధికారిగా ప్రచారాన్ని సమన్వయం చేసి, పర్యవేక్షిస్తారు.

జిల్లాలోని అన్ని బ్యాంక్ శాఖల మేనేజర్లు, నాబార్డు డీడీఎం, డీఆర్‌డీఓ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, మండల, గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు.

శిబిరాల షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ/ULB పరిధిలోని అన్ని బ్యాంకు శాఖలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు.

శిబిరాల తేదీలు, ప్రదేశాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని, లబ్ధిదారులను సమీకరించాలని, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు.

శిబిరాల వద్ద కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని తెలిపారు.

"జిల్లాలోని అర్హులైన ప్రతి పౌరుడూ బ్యాంకింగ్, బీమా, పింఛను సదుపాయాలు పొందాలన్నదే మా లక్ష్యం. ప్రజలు తమ గ్రామంలో నిర్వహించే శిబిరానికి అవసరమైన పత్రాలతో (ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్, మొబైల్ నంబరు తదితర పత్రాలు) హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM