Burgampahad: సారపాక పుష్కరవనంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ భూముల పరిశీలన!
Burgampahad: బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన.
Burgampahad: సారపాక పుష్కరవనంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ భూముల పరిశీలన!
Burgampahad: జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం పరిధిలోని భూములను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి చెందిన రెండు ప్రత్యేక బృందాలు పరిశీలించాయి.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూముల లభ్యత, ప్రాంత పరిస్థితులు, మౌలిక వసతుల అనుకూలతతో పాటు వివిధ శాఖల నుంచి అవసరమయ్యే అనుమతుల అంశాలపై బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు సమాచారం.
పర్యావరణం, అటవీ భూములు, రెవెన్యూ పరిధి తదితర అంశాలను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మండల రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఆర్టీవో అధికారులు ఎయిర్‌పోర్ట్ అథారిటీ బృందాలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు.
ఇప్పటికే జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అంశంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. సారపాక పుష్కరవనం పరిధిలో అధికారుల పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు, భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక అనంతరం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై తదుపరి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.




