Kothagudam: రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి జిల్లా సైబర్ విభాగానికి ప్రథమ స్థానం!

Kothagudam: MHA పోర్టల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Aug 2026 4:41 PM IST
Kothagudam
X

Kothagudam: రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి జిల్లా సైబర్ విభాగానికి ప్రథమ స్థానం!

Kothagudam: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ఎంఆర్ఎమ్, జిఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ వంటి ఆధునిక పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీస్ యూనిట్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది.

ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో నమోదైన పనితీరు ఆధారంగా ప్రకటించిన ఉత్తమ ప్రదర్శన జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమన్వయ కేటగిరీలో మొదటి స్థానాన్ని సాధించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.

సైబర్ నేరాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్పార్క్ క్లబ్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటిపి మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టులు తదితర సైబర్ నేరాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నందుకు గాను విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

సైబర్ నేరాల నియంత్రణలో పోలీసుల చర్యలతో పాటు ముఖ్యంగా యువతలో అవగాహన ఎంతో కీలకమని విద్యార్థులు సైబర్ అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఎంహెచ్ఏ పోర్టల్స్‌లో జిల్లాకు లభించిన ఈ గుర్తింపు పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొంటూ, ఇదే స్ఫూర్తితో సైబర్ నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను, సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్సై జుబేదా బేగం, సైబర్ సెల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story