Burgampahad: లంచం ఇవ్వలేదని అనర్హురాలిగా ప్రకటన అంగన్‌వాడీ అభ్యర్థి ఆవేదన!

Burgampahad: లంచం ఇవ్వనందుకే స్థానిక నేతలు సీడీపీఓకు ఫిర్యాదు చేసి తన్ను అనర్హురాలిగా ప్రకటించారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అంగన్‌వాడీ అభ్యర్థి ఆవేదన.

RAVI, BURGAMPAD AREA
Published on: 8 Sept 2026 10:28 AM IST
Burgampahad
X

Burgampahad: లంచం ఇవ్వలేదని అనర్హురాలిగా ప్రకటన అంగన్‌వాడీ అభ్యర్థి ఆవేదన!

Burgampahad: చదువుకొని మంచి మార్కులు సాధించి అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాలుగుమూరు గ్రామానికి చెందిన బాధితురాలు తన ఆవేదన విలేకరుల సమావేశంలో వెల్లడి చేశారు.

సదరు బాధితురాలు దగ్గర ఆ గ్రామానికి చెందిన అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్న గ్రామంలో ఉన్న నేతలు తనుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తనను అనరురాలుగా ప్రకటన చేయటానికి సదరు cdpo కి లిఖితపూర్వకంగా ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి కాదు అంటూ ధృవీకరణ చేయడంతో ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న బాధితురాలికి చివరి సమయంలో ఆవేదన మిగిల్చిన పరిస్థితి చోటుచేసుకుంది.

తనకు డబ్బులు డిమాండ్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న తనకు ఉద్యోగం రాకుండా చేశారని వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని మీడియా ముంగిట ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదెక్కడి న్యాయం ఏసీబీ అధికారులు లంచాలు తీసుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తూ లంచం తీసుకున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్న అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఒక చిన్న గ్రామంలో అంగన్వాడి పోస్ట్ కు డబ్బులు డిమాండ్ చేసి లంచం ఇస్తేనే పోస్ట్ అంటూ హుకుం జారీ చేయటం ఇప్పుడు గ్రామంలో చర్చకు దారితీసింది.

ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి బాధితురాలు కు న్యాయం చేయాలని ఎవరైతే మధ్యవర్తులుగా వ్యవహరించి ఆమె మనోహరాలుగా ప్రకటించారు వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA