Burgampahad: ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారంలో ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని మనస్తాపంతో చెరప కవిత (20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

RAVI, BURGAMPAD AREA
Published on: 20 Nov 2026 10:01 AM IST
Burgampahad
X

Burgampahad: ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య!

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారంగ్రామం లో ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని మనస్తాపానికి గురైన 20 ఏళ్ల యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చెరువు సింగారంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన చెరప కవిత (20) నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే పెళ్లి విషయంలో యువకుడు నిరాకరించడంతో తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన కవిత పురుగుల మందు తాగినట్లు తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కవిత మృతదేహం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA